NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రియ‌ల్ఎస్టేట్ హాట్ స్పాట్‌గా మారుతున్న బాలాన‌గ‌ర్‌

1 min read

హైద‌రాబాద్, న్యూస్​ నేడు: కూక‌ట్‌ప‌ల్లి వై జంక్షన్‌కు అత్యంత స‌మీపంలో ఉన్న బాలాన‌గ‌ర్ ప్రాంతం హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎక్కువ‌మంది కోరుకునే నివాస‌కేంద్రంగా శ‌ర‌వేగంగా మారుతోంది. వ్యూహాత్మ‌క ప్రాంతం కావ‌డం, మౌలిక వ‌స‌తులు విస్తరించ‌డం, మంచి సామాజిక ప‌రిస్థితులు ఉండ‌డం ఇందుకు దోహ‌దం చేస్తున్నాయి. ఎక్కడినుంచైనా వెళ్లొచ్చే సౌల‌భ్యం, అన్నిర‌కాల జీవ‌న‌శైలులు, సౌక‌ర్యవంత‌మైన ప్రాంతం కావ‌డంతో న‌గ‌రాల్లో ఇళ్లు కొనాల‌నుకునేవారికి ఇది అనువైన ప్రాంతంగా మారింది.ఉత్తర‌, మ‌ధ్య హైద‌రాబాద్‌లు క‌లిసే ప్రాంతంలో ఉన్న బాలాన‌గ‌ర్‌కు ఎక్కడినుంచైనా చేరుకోవ‌చ్చు. ఔట‌ర్ రింగ్‌రోడ్డు కొన్ని నిమిషాల దూరంలోనే ఉండ‌డం, జూబ్లీ బస్ స్టేష‌న్ (జేబీఎస్‌), సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌, మెట్రోరైలు అన్నీ ద‌గ్గర‌లో ఉండ‌డంతో న‌గ‌రంలో ఏమూల‌కైనా ఇక్కడినుంచి వెళ్లచ్చు. హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ, ర‌క్షణ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థ‌ల‌కు వెళ్లడానికైతే బాలాన‌గ‌ర్‌కు మించిన ప్రాంతం మ‌రోటి లేదు. స్థానిక ప్రాంతం కూడా సామాజికంగా, వాణిజ్యప‌రంగా మంచి కేంద్రంగా మారుతోంది.బాలాన‌గ‌ర్ వ్యూహాత్మక‌, స్మార్ట్, సామాజికంగా చైత‌న్య‌వంతంగా ఉన్న ప్రాంతంగా మారుతోంది. క‌నెక్టివిటీ బాగుండే జీవ‌న‌శైలి కావాల‌నుకునేవారికి బాలాన‌గ‌ర్ కేవ‌లం ఒక నివాస‌ప్రాంతం మాత్రమే కాదు.. భ‌విష్యత్తు ఆశాదీపం కూడా.

About Author