NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటుసారా నిర్మూలన కార్యక్రమం …

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: నవోదయము 2.0  నాటుసారా నిర్మూలన కార్యక్రమం తో పాటు కేర్ (CARE) మద్యపానం – వ్యసన విముక్తి కలిగించే కార్యక్రమం  కల్లూరు మండల పరిధిలో  ఓబులా పురం తండా లో నిర్వహించడమైనది  కేర్ కమిటీ కార్యక్రమం లో భాగంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్,ఎస్సై నవీన్ బాబు, సర్పంచ్ శ్రీమతి షేక్ సాహెరాభి మరియు వీఆర్వో  శ్రీమతి షేక్ మున్నీసా మరియు సిబ్బంది  పాల్గొన్న ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యసన విముక్తి   గురించి ప్రసంగించడమైనది.నాటుసారా మరియు బాధ్యతారహితంగా మద్యం సేవించే వ్యసనం వల్ల వచ్చు ఆరోగ్య సమస్యలు, ఇతర అనర్థాల గురించి చక్కగా వివరించడం జరిగింది.  ఈవ్యసన విముక్తికై ఒక కార్యక్రమం పూర్తిగా నిర్వహించడం జరుగింది. తదుపరి నాటుసారా తయారీ మానివేసిన వారికి వివిధ రంగాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి  అవకాశాలను పొందేటట్లు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందు జాబితాను తయారు చేయుటకు ఒక ప్రత్యేక బృందమును ఏర్పాటు చేయడమైనది. వారికి తమ పేర్లు ఇచ్చిన ఎడల వారు ఏ ఏ రంగాలలో నైపుణ్యం ప్రదర్శించగలరో అటువంటి వారికి శిక్షణను ఇప్పించి తదుపరి ఉపాధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేయడమైనది. కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని నాటు సారా తయారు చేయడం పూర్తిగా మానివేసి సారా  వ్యసనం బారిన పడకుండా ఉండాలని మరియు మద్యంను  ను అతిగా సేవించడం వంటివన్నీ కూడా అనారోగ్య అనాలోచిత చర్యలని తెలియ చేయడమైనది. అనంతరం ఓబులాపురం తండా గ్రామ ప్రజల ను ఉద్దేశించి నాటు సారా రహిత గ్రామంగా తీర్మానం చేయడమైనది. గ్రామస్తులు అందరూ సమిష్టిగా నాటు సారాను పూర్తిగా లేకుండా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేయడం జరిగినది.

About Author