NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇన్చార్జి ఎంపీడీఓగా సురేష్ కుమార్..

1 min read

మిడుతూరు, న్యూస్​ నేడు:  (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు ఇన్చార్జి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రేపు సోమవారం నుండి వచ్చే నెల ఆగస్టు 26 వరకు సురేష్ కుమార్ ఇన్చార్జి ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ప్రస్తుతం ఇక్కడ ఎంపీడీవో గా ఉన్న పి. దశరథ రామయ్య రేపటి నుండి వచ్చే నెల 26 వరకు శ్రీకాళహస్తిలో ఫౌండేషన్ కోర్సుపై శిక్షణలో ఉండనున్నారు.ఇదే కార్యాలయంలో కార్యాలయ పరిపాలన అధికారి (ఏఓ) ఏ. సురేష్ కుమార్ కు ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల జిల్లా నుండి పదిమంది ఎంపీడీవోలు శ్రీకాళహస్తిలో జరిగే శిక్షణ కార్యక్రమానికి వెళ్ళనున్నారు.

About Author