NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బసిరెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థి ప్రతిభ

1 min read

రాష్ట్ర స్థాయి పోటీలకు శ్వేతా ఎంపిక

అభినందించిన యాజమాన్యం..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: నందికొట్కూరు పట్టణంలోని బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల విద్యార్థి శ్వేతా జిల్లా స్థాయి వక్తృత్వ పోటీల్లో ఉన్నత ప్రతిభ కనబరచినట్లు కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో శ్వేతా మూడవ స్థానంలో నిలిచిందని అన్నారు.కళాశాలలో శ్వేతా డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుందని అన్నారు. ఈనెల 28 న గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో శ్వేత పాల్గొంటున్నట్లు తెలిపారు.జిల్లా స్థాయి వాక్చాతుర్యం పోటీల్లో శ్వేత పాల్గొన్నారు.శ్వేతను కళాశాల  డైరెక్టర్లు రమేష్ రెడ్డి,సరళా దేవి,కరస్పాండెంట్ సత్య నారాయణ,ప్రిన్సిపాల్ మన్సూర్ మరియు సిబ్బంది. అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక,నైపుణ్య ఆధారిత పోటీల్లో రాణించడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

About Author