NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండవ రోజుకు చేరిన అంగన్వాడీల రిలే దీక్షలు

1 min read

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ పిఎఫ్ అమలు చేయాలి.సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర 

న్యూస్ నేడు, పత్తికొండ : సమస్యల పరిష్కారం కోసం  పత్తికొండ పట్టణంలో కోరమండల్ ముందు అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి. మంగళవారం రెండవ రోజు దీక్షలో అంగన్వాడి హెల్పర్స్ నాయకురాలు అంజనమ్మ, విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని గ్రాట్యూటీ పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రేపటి తరం కోసం నేటి బాలలు వారి తల్లులు సంరక్షణ పనులలో అంగన్వాడీల శ్రమ బాధ్యతలు కీలకంగా మారాయని గర్భిణీలు బాలింతలు , శిశువులు పిల్లల ఆరోగ్యాలను కాపాడటంలో వారికి సమతుల్య ఆహారాన్ని అందించడంలో పిల్లల మనోవికాశాలను మెరుగుపరచడంలో ఐసిడిఎస్ లక్ష్యాలను ముందుకు తీసుకుపోతున్నది అంగన్వాడీ లని ప్రభుత్వం గుర్తించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చట్టం ప్రకారం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న మినీ వర్కర్లు అనుభవాన్ని పరిగణంలోకి తీసుకుని వారిని మెయిన్ వర్కర్లుగా మెయిన్ సెంటర్లుగా మార్చాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు రంగారెడ్డి దస్తగిరి తుగ్గలి మండలం సిఐటియు కార్యదర్శి శ్రీరాములు మద్దికేర మండలం సిఐటియు కార్యదర్శి బురుజుల రాముడు ప్రజానాట్య మండలి మండల కార్యదర్శి ఎం రమేష్ కాశి రైతు సంఘం నాయకులు రాజుల సారప్ప. ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి హెల్పర్లు లక్ష్మీదేవి ఫక్రున్ బి భూదేవి గాయత్రి అనసూయ అనురాధ లలితమ్మ మీనాక్షమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author