ఈనెల 27న సింగపూర్ కు ఉత్తమ ఉపాధ్యాయులు!
1 min read

డిసెంబర్ 5న మెగా పిటిఎంకు ఏర్పాట్లు చేయండి
డిఇఓలు, ఎంఇఓలు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే
విద్యాశాఖపై రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి , న్యూస్ నేడు: అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వతేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఈనెల 27నుంచి డిసెంబర్ 2వతేదీ వరకు వారంరోజుల పాటు ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ లోని ప్రముఖ స్కూళ్లను సందర్శించాలి, అక్కడి అధునాతన సాంకేతికలతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, క్లాసు రూముల్లో వాతావరణం తదితరాలపై పూర్తిస్థాయి అధ్యయనంచేసి, రాష్ట్రంలో విద్యాప్రమాణాల మెరుగుకు మనం ఏం చేయగలమో నివేదిక రూపంలో అందజేయాలని అన్నారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన శాసనసభ్యుల కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్పులకు ఎంపికకు అవసరమైన 8వతరగతి విద్యార్థులను చైతన్యపర్చి వారికి ప్రోత్సాహం కల్పించాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. అమరావతి లో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు, పబ్లిక్ లైబ్రరీల బలోపేతం, పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మానవవనరులశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయ రామరాజు, సమగ్రశిక్ష స్టేట్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

