గుడిసె కృష్ణమ్మకు శుభాకాంక్షలు..
1 min read

టీటీడీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన గుడిసె కృష్ణమ్మకు, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ కు మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి , యువ నాయకులు ఎన్. రాకేష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, వాల్మికులకు పెద్దపీట వేసి జిల్లా స్థాయిలో కీలక బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు అలాగే యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నయువనేత నారా లోకేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అలాగే, గుడిసె కృష్ణమ్మ నాయకత్వంలో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టి పెద్దకడుబురు టీడీపీ మాజీ మండల ఈరన్న బసలదొడ్డి , కౌతాళం మండల అధ్యక్షులు సురేష్ నాయుడు ,కోసిగి మండల మాజీ అధ్యక్షులు జ్ఞానేష్ , సతీష్ నాయుడు, పెద్దకడుబుర్ మండల టీడీపీ అధ్యక్షులు బసలదొడ్డి మల్లికార్జున మరియు జిల్లా నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

