క్రైస్తవుల సంక్షేమానికి కృషిచేస్తా
1 min read

ఈ నెల 30 న ఫాస్టర్ల కు దుస్తులు పంపిణీ కార్యక్రమం
క్రిస్మస్ వేడుకల్లో మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : మంత్రాలయం నియోజకవర్గంలో క్రైస్తవుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం క్రిస్మస్ పండుగ సందర్భంగా మాధవరం సిఎస్ ఐ చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి క్రైస్తవ సంఘ కాపరుల కుటుంబానికి నూతన దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తారీఖున నియోజకవర్గంలోని పాస్టర్ ల అందరికి నూతన వస్త్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు . అదేవిధంగా క్రైస్తవ సోదరులకు ఎటువంటి అవసరం వచ్చినా తమను సంప్రదించవచ్చన్నారు. అనంతరం క్రైస్తవ సోదరులు ఆయన కు శాలువ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు భూపతి, వినోద్, తిమోతి, పాలరాజు అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

