మోక్షగుండం విశ్వేశ్వరయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జయంతి వేడుకలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరం లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరియు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సహాప్రధాణాచర్య వాసు మాట్లాడుతూ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజనీర్ అని తరువాత తిరుమల ఘాట్ రోడ్డు రూపాకల్పన చేసారని ఈయన భారత రత్న అవార్డు గ్రహీత అని ఈయన మైసూర్ రాజాస్థానంలో దివాన్ గా పని చేసారని మొదలగు విషయాలు తెలియజేసారు. గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఈయన గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ అని తెలియజేసారు. దేశ స్వాతంత్ర సమరంలో ఎన్నో సార్లు జైలు కి వెళ్లారని తెలపారు.ఈకార్యక్రమంలో ప్రధానచార్యులు డి. రామాంజినేయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


