శ్రీ గౌరీ మల్లేశ్వర స్వామి ఆలయంలో అన్నాభిషేక మహోత్సవం
1 min read
న్యూస్ నేడు , చెన్నూరు : మండలంలోని రామనపల్లె గ్రామంలో వెలసిన శ్రీ గౌరీ మల్లేశ్వరి ఆలయంలో అన్నాభిషేక మహోత్సవాన్ని కె వెంకటేశ్వర శర్మ శివాలయ అర్చకులు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం చివరి రోజు అమావాస్యను పురస్కరించుకొని 32 మంది వేద పండితుల తో శ్రీ గౌరీ మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు గావించారు. గురువారం ఉదయం సుప్రభాత సేవతో మొదలు స్వామి అమ్మవార్లకు పూజా కాంకర్యాలు, హోమాలు, అభిషేకాలు, గావించారు. గురువారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలతో గావించిన ఈ ఆలయంలో అయ్యప్ప స్వాములు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు కె. వెంకటేశ్వర స్వామి మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల తోపాటు మండలంలోని ఇతర గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు భక్తులు తరలి రావడం జరిగింది.

