NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘విద్యుత్​ ’ డిమాండ్లు నెరవేర్చాల్సిందే..

1 min read

లేదంటే పోరాటం ఉధృతం చేస్తాం..

  •  విద్యుత్​ ఉద్యోగుల జేఏసీ కర్నూలు జిల్లా చైర్మన్​ సతీష్​
  • రిలే నిరాహారదీక్షను విరమించిన ఉద్యోగులు

కర్నూలు, న్యూస్​ నేడు : విద్యుత్​ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు పోరాటం ఆగదని పిలుపునిచ్చారు విద్యుత్​ ఉద్యోగుల జేఏసీ కర్నూలు జిల్లా చైర్మన్​ సతీష్​.  రెండవ రోజు శనివారం స్థానిక విద్యుత్​ సర్కిల్​ భవనం ఎదురుగా రిలే నిరాహారదీక్ష కొనసాగింది.  ఈ సందర్భంగా   జేఏసీ చైర్మన్ సతీష్, జేఏసీ జిల్లా కన్వీనర్ రమణ మూర్తి మాట్లాడుతూ విద్యుత్​ ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్​ పద్దతిలో పని చేసే కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించేందుకు విడతల వారీగా నిరసన తెలుపుతామన్నారు. సమస్యల సాధనకు నిరంతరం కృషి చేస్తామన్నారు.  దీక్ష అనంతరం నిమ్మకాయ నీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో  జేఏసీ నాయకులు రామ్లా నాయక్,  మేరి, రాణి, ఉసేని, లక్ష్మన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author