NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు సరికొత్త నూతన పాస్ పుస్తకాలు:ఎమ్మెల్యే

1 min read

పుస్తకాలను పంపిణీ చేసిన మాండ్ర..

నందికొట్కూరు న్యూస్ నేడు: రైతులకు రైతు ఫోటోతో పాటు సరికొత్త నూతన పొలం పాస్ పుస్తకాలను అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని దేనని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని మద్దూరులో జరిగిన’మీభూమి-మీహక్కు’ కార్యక్రమంలో భాగంగా 1213 మంది రైతులకు పొలం పాస్ పుస్తకాలను సోమవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.జూపాడుబంగ్లా మండలం పారుమంచాల, తరిగోపుల గ్రామాల్లో ఉమామహేశ్వరుడు,చాకలి నాగన్న,సయ్యద్ నూరుల్లా, సుంకులమ్మ లకు ముఖ్యమంత్రి సహాయనిధి-8 లక్షల 50వేల 535 రూ.ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారి ఇండ్లకు వెళ్లి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.తరిగోపులలో ఒకటవ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు పాలు,గుడ్లు, భోజనం సక్రమంగా అందుతున్నాయా అని చిన్నారులను అడిగారు.కేంద్రం వద్ద వర్షపు నీటి నిల్వతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని అంగన్వాడి టీచర్ శ్రీదేవి,వర్కర్ రాజ్యలక్ష్మి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పుస్తకాలను పంపిణీ చేసిన మాండ్ర

నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో ఎంపీయూపీ పాఠశాలలో టీడీపీ మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంచిగా చదువుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సురేంద్ర నాథ్ రెడ్డి విద్యార్థులతో అన్నారు.ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి కడియం వెంకటేశ్వర్లు యాదవ్, గిరీశ్వర్ రెడ్డి,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *