NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్టర్ సుధీర్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మార్పీఎస్

1 min read

కోట ప్రభాకర్ మాదిగ, కాటెపోగు జయన్న మాదిగ.. 

నందికొట్కూరు న్యూస్ నేడు:  నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దారా సుధీర్ 12 వ తేదీన చేసిన వ్యాఖ్యలను నందికొట్కూరు ఎంఆర్పిఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో  సోమవారం మధ్యాహ్నం ఎమ్మార్పీఎస్ నాయకులు. కోట ప్రభాకర్ మాదిగ నంద్యాల జిల్లా ఎంఎస్పి అధికార ప్రతినిధి,నందికొట్కూర్ ఇన్చార్జ్ మరియు కాటెపోగు జయన్న మాట్లాడుతూ నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యపైడాక్టర్ సుధీర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆధారాలు లేకుండా ఒక శాసనసభ్యుడిపై విమర్శలు చేయడం మంచిది కాదని నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి రేషన్ బియ్యం నీకంత  పనికి రానివి కావచ్చు కానీ మాలాంటి చాలామంది పేదలు అవే రేషన్ బియ్యం తింటూ జీవనాన్ని సాగిస్తున్నామని పేదవాళ్ల రేషన్ బియ్యం చులకనగా చూసే నీకు ప్రజల కష్టాల గురించి ఏం తెలుసు.? అని నీ దగ్గర ఉన్న డబ్బు తీసుకొని రాజకీయాల్లో పెట్టి వాటిపై వ్యాపారం చేయడానికి వచ్చావని ప్రజలు నీ మోసపూరితమైన మాటలు వినే పరిస్థితిలో లేరని ఇంకోసారి గనుక మా దళిత ఎమ్మెల్యేని విమర్శిస్తే ఎమ్మార్పీఎస్ చూస్తూ ఊరుకోదని మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కనకం నాగరాజు,మిడుతూరు భూపనపాడు సతీష్,బోరెల్లి ఈశ్వరయ్య,బోరెల్లి ప్రకాశం, గద్దల వెంకటరత్నం,జడల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *