NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లిపాలలో రోగ నిరోధక శక్తి అధికం

1 min read

అవగాహన కల్పించిన సూపర్ వైజర్ శేషమ్మ..

నందికొట్కూరు న్యూస్ నేడు: పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు తప్పనిసరిగా వీటిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని పగిడ్యాల అంగన్వాడీ సూపర్వైజర్ శేషమ్మ అన్నారు.నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని బీరవోలు గ్రామంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడి కేంద్రంలో బుధవారం బాలింతలకు గర్భవతులకు సూపర్వైజర్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపుముర్రుపాలు తప్పనిసరిగా ఇవ్వాలని”ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఈనెల 1 నుండి 7 వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి.ఆరు నెలలు దాటిన తర్వాత తల్లిపాలతో పాటు పోషకాహారం కూడా ఇవ్వాలని బిడ్డ పుట్టిన తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే వాటి గురించి మరియు గర్భవతి సమయంలో బిడ్డ సురక్షితంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు పోషకాహారం తదితర వాటి గురించి గర్భవతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్పి రాజు,ఏఎన్ఎం గుండమ్మ,అంగన్వాడీ కార్యకర్త పద్మావతి,ఆశా కార్యకర్తలు సాలమ్మ లలితమ్మ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *