NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాదయాత్రలు జయప్రదం చేయండి… పి. రామచంద్రయ్య 

1 min read

చలో ఢిల్లీ గోడ పత్రికలు విడుదల చేస్తున్న సిపిఐ నాయకులు 

 న్యూస్ నేడు, పత్తికొండ:    కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 6 నుండి 15 తేదీ వరకు సిపిఐ చేపట్టబోయే పాదయాత్రలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక చదువుల రామయ్య భవనంలో చలో ఢిల్లీ గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టారని, అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన ఏ ఒక్క హామీని నెరవేర్చింది లేదన్నారు. బిజెపి ప్రభుత్వం మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై దాడులకు పాల్పడుతూ, దేశద్రోహులంటూ నిర్బంధాలకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ సమితి కార్యక్రమంలో భాగంగా మార్పు అవసరం అనే నినాదంతో  పాదయాత్రలు, ప్రచార యాత్రలు చేపట్టి, ఈనెల 18న కలెక్టరేట్ ముట్టడి చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గింపు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మహిళలకు రక్షణ చట్టం, విద్యా, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి పి. భీమ లింగప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రాజా సాహెబ్, మండల కార్యదర్శి యు. కారుమంచి, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు కారన్న, పెద్ద ఈ రన్న, గిడ్డయ్య గౌడ్, నెట్టికంటయ్య, ప్రజా సంఘాల నాయకులు రంగన్న, జోహారాపురం కాశి, మాదన్న, గుండు భాష, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *