NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిఎస్ఎన్ఎల్ 4 జి నెట్ వర్క్ సేవలు ఈనెల 27  నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం

1 min read

బిఎస్ఎన్ ఎల్ ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం

విజయవాడ, న్యూస్​ నేడు:  పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బిఎస్ఎన్ఎల్ 4జి నెట్వర్క్ సేవలు ప్రారంభిస్తున్నట్లు  బిఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం వెల్లడించారు. ఈ నెల 27న భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు.  ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం  బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఫోర్ జి నెట్వర్క్ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ నెట్వర్క్  సేవలను భారత ప్రధాని మోడీ ఈనెల 27న దేశవ్యాప్తంగా ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సేవలు ప్రారంభం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సమాచార గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. బిఎస్ఎన్ఎల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన నెట్వర్క్ ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author