NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొండపేట బ్రిడ్జిపై కరెంటు స్తంభాలు లైటింగ్ ఏర్పాటు

1 min read

చెన్నూరు ,న్యూస్ నేడు: కొండపేట బ్రిడ్జి పైన చెన్నూరు గ్రామపంచాయతీ, కొండపేట గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధులతో కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయడమే కాకుండా కరెంటు ఇవ్వడం జరుగుతుందని కొండపేట సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, చెన్నూరు సర్పంచ్ సిద్ధిగారి వెంకటసుబ్బయ్యలు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇరువురు కార్యదర్శులతో, అధికారులతో సర్పంచులు కొండపేట బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొండపేట బ్రిడ్జి నుండి, అటు కనపర్తి, బలిసింగాయపల్లె, రామాపురం ఎస్టి కాలనీ, కైలాసగిరి కోన తో పాటు దౌలాతాపురం, దౌలాతాపురం ఎస్టి కాలనీ లకు నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని అంతేకాకుండా  ఉదయం , సాయంత్రం సమయాలలో, యువకులు, సీనియర్ సిటిజన్స్ వాకింగ్ కు రావడం బ్రిడ్జి పైన దాతలు, గ్రామపంచాయతీలు ఏర్పాటుచేసిన సిమెంట్ బెంచీ లలో సేద తీర్చుకుంటున్నారని అలాంటిది. రాత్రిపూట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్రిడ్జి పైన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు కొంత ఉపశమనం తో పాటు ఎలాంటి ప్రమాదాలకు గాని, ఇబ్బందులకు కానీ తావుండదని వారు తెలియజేశారు. అలాగే టిడిపి మండల కన్వీనర్ కల్లూరి విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ,చెన్నూరుగ్రామపంచాయతీలో ఎక్కడ కరెంటు సమస్యలు ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎక్కడ కూడా కరెంటు స్తంభాలు, కరెంటు సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం యువ నాయకులు, పవన్ కుమార్ రెడ్డి, కల్లూరి ఓబుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author