NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పింఛన్లను పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి..

1 min read

గ్రామాన్ని అభివృద్ధి చేస్తా:ఎంపీ

మిడుతూరు, న్యూస్ నేడు:  అన్ని రకాల పింఛన్లను పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే నని నంద్యాల ఎంపీ మరియు పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎంపీ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ముందుగా గ్రామ సర్పంచ్ పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీకి ఘన స్వాగతం పలికారు.వృద్ధులకు, దివ్యాంగులకు వితంతువులకు పింఛన్లు నగదును అందజేశారు.తర్వాత ‘స్మార్ట్’ నూతన రైస్ కార్డులను ఎంపీ గ్రామ ప్రజలకు అందజేశారు. మిడుతూరు నుండి రోడ్డు అధ్వానంగా ఉందని వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డును వేయించాలని మహిళలు ఎంపీకి విన్నవించారు.రోడ్డు వేయించేందుకు కృషి చేస్తానని అంతేకాకుండా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎంపీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,సీతారామి రెడ్డి, సర్పంచ్ లు జీవరత్నం,వెంకటరామి రెడ్డి ఎస్ఐ ఓబులేష్ నాయకులు తువ్వా భగీరథ రెడ్డి,అయ్యపు రెడ్డి,నాగేశ్వ రావు,నవాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

About Author