డోన్‌లో షటిల్ బ్యాడ్మింటన్ సందడి
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ పట్టణంలోని బుగ్గన శేషారెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు క్రీడా స్పూర్తికి అద్దం పట్టేలా అద్భుతంగా జరిగాయి. స్టేడియం నిర్వాహకులు పోటీలను A, B, C మూడు విభాగాలుగా విభజించగా సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటుకున్నారు. ముఖ్యంగా ABC కేటగిరీలో వెంకట్రావు, సురేంద్ర (బ్రో), వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ లక్ష్మణ్, జనార్ధన్, డోన్ జైలర్ సురేష్, ఖాన్ విజేతలుగా నిలవగా, నాయక్, ఉపాధ్యాయులు అశోక్, అలీ, అలిపిర, కర్ణ, రవీంద్రలు రన్నర్స్ గా నిలిచి పోటీని మరింత రసవత్తరంగా మార్చారు. విజేతలకు ఇండోర్ నిర్వాహకులు, సీనియర్ క్రీడాకారులు, మరియు పారిశ్రామికవేత్త కాజా, విజేతలకు టోపీలు అందజేశారు, ఈ సందర్భంగా సీనియర్ క్రీడాకారులు మాట్లాడుతూ… ఇటువంటి ఇండోర్ పోటీలు స్థానిక క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రతి క్రీడాకారుడు సమయస్ఫూర్తి, జట్టు భావనతో పోటీల్లో పాల్గొనడం ఈ టోర్నమెంట్ విజయానికి కీలకమైందని పేర్కొన్నారు. అలాగే ఇండోర్ క్లబ్ నిర్వాహకుడు చైతన్య రాజ్ త్వరలోనే పదో తరగతి లోపు విద్యార్థులకు ప్రత్యేకంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించడం జరిగింది, ఈ ప్రకటనతో యువ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందించినట్లు అవుతుందని స్థానిక ఇండోర్ క్రీడాకారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు .


