శ్రీ నవనంది పాఠశాలను రద్దు చేయండి
1 min read
-డిఈవో కు పిడిఎస్ యు వినతి..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉన్న శ్రీ నవనంది పాఠశాలను రద్దు చేయాలని పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ డిమాండ్ చేశారు.నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ స్పందనలో నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.శ్రీ నవనంది పాఠశాల యాజమాన్యం నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పాఠశాలలో వివిధ రకాల పేర్లతో జరుగుతున్న ఫీజుల దోపిడీ అరికట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి.డి.ఎస్.యు) డిమాండ్ చేశారు.పుస్తకాలు, యూనిఫారం,అడ్మిషన్ ఫీజ్,ఫీజు పేర్లతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.విద్యాశాఖ అధికారులు నిద్రావస్థలో ఉండటం వల్ల విద్యను అంగడి సరుకుగా మారుస్తున్నారని విమర్శించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పిడిఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యులు పి.మర్రి స్వామి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు లాజరస్, సిపిఎం డివిజన్ నాయకులు కర్ణ,పిడిఎస్యు నందికొట్కూరు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఆసిఫ్,సాయి పాల్గొన్నారు.


