రాయలసీమ ప్రాజెక్టు నిలిచిపోవడానికి వైయస్ జగనే కారణం
1 min read

పత్తికొండ , న్యూస్ నేడు: రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ స్పష్టం చేశారు.మంగళవారం పత్తికొండ నియోజకవర్గం లోని రాతన గ్రామంలో హంద్రీనీవా కాలువ ద్వారా 108 చెరువులు నింపే ప్రాజెక్టులో భాగంగా రాతన చెరువును కృష్ణా జలాలతో నింపిన సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్, కర్నూలు జిల్లా గ్రంధాల చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు చెరువులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని, ఇది ముమ్మాటికీ రాయలసీమకు జగన్ చేసిన ద్రోహమేనన్నారు. జగన్ రెడ్డి చేసిన తప్పును కప్పిపెట్టి, తమ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు. 40 ఏళ్లలో వైఎస్ కుటుంబం చేయలేని పనిని సీఎం చంద్రబాబు చేసి చూపించారని ఆయన అన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దారని చెప్పారు . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా ద్వారా కర్నూల్ నుండీ కుప్పం వరకూ సాగు నీరందించ గలిగామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించేలా సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. రాయలసీమకు తాగు, సాగునీరు కల్పించిన ఘనత ముఖ్యమత్రి చంద్రబాబుదేని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మనోహర్ చౌదరి, పాలెగర్ రామానాయుడు,తుగ్గలి మండల కన్వీనర్ తిరుపాలు నాయుడు, పత్తికొండ మండల కన్వీనర్ కడవల సుధాకర్, తుమ్మల ఈరన్న,మైరాముడు, సీతారాముడు, మహిళా నాయకురాలు ఈరమ్మ, ఇతర ముఖ్యనాయకులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

