NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిడిపివోలు, యంఇవోలు సమన్వయంతో పనిచేయాలి

1 min read

అంగన్వాడీ కేంద్రాల్లో 5 సంవత్సరాలు నిండిన పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేయాలి

సిడిపివోలు,యంఇవోలు సమన్వయంతో పనిచేయాలి

జిల్లాకలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఐసిడిఎస్ అధికారులతో జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్

సిడిపిఓలు,ఎంఈఓ లు సమన్వయంతో పనిచేయాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :అంగన్వాడీ కేంద్రాల్లోని 5 సంవత్సరాలు నిండిన పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసేందుకు సిడిపివోలు, యంఇవోలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. జీరో ఎన్రోల్మెంట్ కలిగిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జీరో నమోదు ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంగన్వాడీ కేంద్రాల్లోని 5 సంవత్సరాలు నిండిన పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసేందుకు కృషిచేయాలన్నారు. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.  హేబిటేషన్ లో పిల్లలు లేరని పేర్కొన్న మండల విద్యాశాఖ అధికారులు, సిడిపివోలు, హేబిటేషన్ లో పిల్లలు లేరని ధృవీకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. సమావేశంలో ఐసిడిఎస్ పిడి పి. శారద, డిఇఓ యం. వెంకట లక్ష్మమ్మ, మండల విద్యాశాఖ అధికారులు, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు, ఐసిడిఎస్ సిడిపివోలు పాల్గొన్నారు.

About Author