హొళగుంద సిద్దేశ్వరస్వామి జాతరను జయప్రదం చెయండి
1 min read

హొళగుంద సిద్ధేశ్వరస్వామి జాత్ర వాల్పోస్టర్లను విడుదల చేస్తున్న ఆలయ ధర్మకర్తలు, గ్రామపెద్దలు
హోళగుంద న్యూస్ నేడు: హొళగుందమండల ప్రజల ఆరాధ్య దేవుడిగా పూజింపబడుతున్న హొళగుంద శ్రీసిద్ధేశ్వరస్వామి జాతర ఉత్సవాలకు భక్తులు తరలి వచ్చి జయప్రదం చెయాలని ఆలయ వంశ పారంపార్య ధర్మకర్తలు రాజ పంపన్నగౌడ్, శివ శంకర్ గౌడ్, సిద్ధార్థగౌడ్లు పిలుపునిచ్చారు. సోమవారం వారు గ్రామపెద్దలతో కలిసి జాతరకు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పంపన్నగౌడ్ మాట్లాడుతూ సిద్దేశ్వర స్వామిని ఎంతో మహిమ కలిగిన దేవుడిగా భక్తులు కొలుస్తారని ఈ నెల 23 నుంచి మొదలయ్యే జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 26న సోమవారం నంది ఉత్సవం, 27న మంగళవారం గజోత్సవం, 28న బుధవారం రథోత్సవం, 29న లంకాదహనం, 30న వసంతోత్సం కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని వారు చెప్పారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు కొట్రేశ్, అమరేశ్, డిస్ మంజునాథ్, డాక్టర్ జగదీశ్, రిటైర్డ్ టీచరు సిద్ధబసప్ప, హోటల్ పణి, జగ్గేశ్, రవి, తదితరులు పాల్గొన్నారు.

