NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధికారులకు – ఉద్యోగులకు ఎస్టీ  కమిషన్ అండ

1 min read

కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జి రెడ్డి

ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు డా:దేవరకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు గిరిజన భవన్ లో ఆదివారం నిర్వహించిన మూడంచెల సభలో ఎస్టీ  వర్గాలకు చెందినఅధికారులకు- ఉద్యోగులకు కమిషన్ అండగా ఉంటుందని చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి   స్పష్టం చేశారు. కమిషన్ చైర్మన్ బొజ్జి రెడ్డి, సభ్యులు పన్నర్సు వెంకటప్ప ,గొర్లె సునీత, కాకి లక్ష్మీ లకు ఎస్టి ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్:దేవరకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారిని అభినందిస్తూ ఘనంగా సత్కారం జరిగింది.ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ రీజియన్  చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, జిల్లా బిజెపి అధ్యక్షులు విక్రమ్ కిషోర్, తదితర అధికారపక్ష నేతలు, ప్రముఖుల సమక్షంలో సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.తొలుత బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సంయుక్త 2026 డైరీని ముఖ్య అతిథులు ఆవిష్కరించారు . ముందస్తుగా మహిళల ప్రస్తుత అక్షరాస్యత శాతాన్ని  55 శాతం నుంచి 100% శాతానికి తీసుకువెళ్ళడానికి పది సంవత్సరాల దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. సంఘం రెండవ లక్ష్యం బహుజన వర్గాల నుంచి  ఉత్తమమైన నాయకులను సమాజానికి అందించడం అన్నారు .లక్ష్యాల సాధనలో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, విమర్శలు, ఈర్ష్య ,ద్వేషం ,అసూయ, కుట్ర ,కుతంత్రాలు వంటివి ఎన్నో నెగటివ్ ధోరనులు ఎదురవుతాయని, వాటిని ఎదుగుతున్న నాయకులు  ఓర్పుతూ, నేర్పుతూ, ప్రణాళికతో, వ్యూహంతో ఎదుర్కోవాలని ఆయన పేర్కొన్నారు .అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వందలాదిమంది సంఘం నాయకులు, సభ్యులు రాష్ట్ర నలుమూలల నుంచి జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా,స్థాయి, నియోజక,వర్గ స్థాయి, మండల స్థాయి ల నుంచి  నుంచి పాల్గొన్నారు  సంఘ నాయకులు సాలా భోగేశ్వరరావు, గంటి మల్ల, సత్తిబాబు దేవరకొండ సాంబశివరావు, దేవరపల్లి రత్నబాబు, రవి , సింగం త్రిమూర్తులు,మొగిలి ఆంజనేయులు, వల్లకవి శ్రీనివాసరావు, దేవరకొండ సుశీల, ఆవుల సునీత, రిటైర్డ్ ఎస్పీ శ్రీరామ రాజారావు, కృష్ణ రేఖ, దుర్గయ్య, అడ్వకేట్స్ ఏలూరు వెంకటేశ్వరరావు, మహేష్ ,చంద్రప్ప,తిమ్మసత్తి నాగేశ్వరరావు,గుడిపాటి నరసింహారావు,దేవరకొండ నాగమణి, నెరుసు నాగమణి, డివివి నరసింహారావు, తోత్తుకు శ్రీనివాసరావు,గేదెల సత్యం, దేవరకొండ సురేష్, హిమబిందు, శంకర్ శ్రీను, చక్రవర్తి, కొమ్మోజు శ్రీనివాసరావు,సొంగ మధు, వసంత కుమార్, తదితరులు పాల్గొన్నారు.

About Author