కార్మిక శాఖ కు వెంటనే ” సెస్ ” చెల్లించాలి
1 min read

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు , న్యూస్ నేడు : అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు చేయిస్తున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఖర్చు మొత్తం నుండి ఒక శాతం సెస్ ను కార్మిక శాఖకు వెంటనే చెల్లించాల్సిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంకాలం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి చైర్మన్ గా వ్యవహరిస్తూ జిల్లా కార్మిక శాఖ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమం కొరకు సెస్ ఆక్ట్ 1996 ను మరియు నిబంధనలు 1998 ను రూపొందించారు. భవన నిర్మాణ చట్టం ప్రకారం పది మంది కంటే ఎక్కువ మంది పని చేసే పనుల యందు నిబంధనల మేరకు వారు ఖర్చు చేసే మొత్తం నుండి ఒక శాతం సెస్ ను మినహాయించి ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ భవన నిర్మాణ శాఖ కార్మిక సంక్షేమ బోర్డు , విజయవాడ కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలాన్ రూపంలో కానీ డ్రాఫ్ట్ రూపంలో కానీ చెల్లించవలసిందిగా ఆదేశించారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఏమాత్రం పనులు జరిగి బిల్లులు చెల్లించడం జరిగినది ఆ మొత్తానికి మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలో జరిగే పనులకు చెల్లించే బిల్లులకు సంబంధించి విడివిడిగా సెస్ ను జమ చేయించవలసిందిగా కోరుతూ అందుకు సంబంధించిన ప్రొఫార్మాలను పూర్తిచేసి కార్మిక శాఖ కార్యాలయాలకు పంపవలసిందిగా అధికారులను కోరారు. మెంబర్ కన్వీనర్ డిప్యూటీ లేబర్ కమిషనర్ వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ కు , అధికారులకు సెస్ వివరాలు , చేయవలసిన విధి విధానాలు సమర్పించవలసిన ప్రొఫార్మాల గురించి వివరించారు. ఈ సమావేశానికి జిల్లా కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ లు సీతా లక్ష్మి మరియు సాంబశివ , డెప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు , జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి , డ్వామ పిడి వెంకటరమణయ్య , డిప్యూటీ కమిషనర్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి , ఇంచార్జ్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ కృష్ణ , అడిషనల్ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి , ఎడి ఇండస్ట్రీస్ డేనియల్ , డిఆర్డిఏ పిడి రమణారెడ్డి , డిపిఓ భాస్కర్ , సిపిఓ భారతి , జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్ర రావు , పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ రామకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు.

