NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రేక్షకులను ఆకట్టు కున్న చైతన్య సంస్థ విద్యార్థుల నృత్య ప్రదర్శన

1 min read

గురు పూజోత్స వం లో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చే ప్రశంసలు

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె లో నిర్వ హించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో చైతన్య సర్వీస్ సొసైటీ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన ప్రేక్షకులు, అహుతులను  ఆకట్టుకుంది. ఈ కార్య క్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లె శాసనసభ సభ్యులు షాజహాన్ భాష, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్ర హ్మణ్యం లు ముఖ్య అతిథులుగా హాజ రయ్యారు.ఈ సందర్భంగా చైతన్య సర్వీస్ సొసైటీకి చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. విద్యార్థుల ప్రతిభ ను అభినందించిన అతిథులు, వారిని ప్రోత్సహించడంలో సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసిం చారు.ఇందులో భాగంగా చైతన్య సర్వీస్ సొసైటీ జనరల్ సెక్రటరీ  కవితారాణి,  అడ్మిని స్ట్రేటివ్ డైరెక్టర్ డా. జి.వి.ఎస్. బాబును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష సన్మానించి అభినం దించారు. విద్యార్థుల విద్యా, సాంస్కృతిక వికాసానికి చైతన్య సర్వీస్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు. భవిష్యత్తు లో కూడా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి జిల్లా ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *