చంద్రబాబు నాయకత్వం లోనె బిసిలకు రాజ్యాధి కారం
1 min read
పుంగనూరు టిడిపి ఇంచార్జి కి శుభా కాంక్షలు
టిడిపి సీనియర్ నాయకులు విశ్రాంత డిఎస్పీ సుకుమార్ బాబు
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిది : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 50 శాతం ఉన్న బీసీలకు అగ్రభాగం మిస్తూ, 34 శాతం రిజర్వేషన్లు ఇస్తా మని చంద్ర బాబు నాయుడు గంటా పదంగా చెబుతున్న నేపథ్యంలో బీసీల ను రాజ్యాధికారం దిశగా ముందుకు నడిపించాలని తెలుగుదేశం పార్టీ పుంగునూరు నియో జకవర్గం సీనియర్ నాయకులు మరియు విశ్రాంత డిఎస్పి సుకుమార్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం పుంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నూతన ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన మధు సుధన్ నాయుడు ను మర్యాద పూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందించి దుశ్యాలువతో ఘనంగా సన్మానించారు. గతంలో పుంగనూరు నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వ్యవహార శైలి సక్రమంగా లేక పోవడం వల్లనే అధిష్టానం ఆ విషయాన్ని గ్రహించి వేరొకరికి అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. అంతేకాకుండా పుంగనూరు నియోజక వర్గానికి కొత్తగా ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన మధుసూదన్ నాయుడు దృష్టికి పార్టీ కార్యకర్తలు, ప్రజల సమస్యలను తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అయితే ఆయన కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సమస్యల పైన, పార్టీ పైన అవగాహన పెంచుకోవ టానికి సమయం ఇవ్వాలన్నారు. వచ్చే సంవత్సరం నుంచి పార్టీ ఇన్చార్జితో కలిసి పార్టీని ముందుకు తీసుకు వెళ్లడానికి సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయడం జరుగుతొందని స్పష్టం చేశారు. కావున రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి విజయపదం వైపు నడి పించాలని కోరారు.

|


