చలో విజయవాడ రిలే నిరహార దీక్షలు విజయవంత చేయాలి: ప్యాప్టో కర్నూలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు డీఈఓ ఆఫీస్ ప్రాంగణంలో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) చైర్మన్ ఎం మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు డివిజన్ సభ్య సంఘ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు ఉద్యమ కరపత్రాలను అందజేయడంతో పాటు, మూడంచల ఉద్యమ కార్యాచరణలో భాగంగా మూడోదశ కార్యక్రమం చలో విజయవాడ ధర్నా చౌక్ నందు ఏప్రిల్ 25, 26 మరియు 27 తారీకులలో నిర్వహించ తలపెట్టిన రిలే నిరాహార దీక్షకు మన కర్నూలు జిల్లా కేటాయింపు జరిగిన 26 వ తేదీ కర్నూలు జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, కర్నూలు ఫ్యాప్టో చైర్మన్ యం . మధుసూదన రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశానికి ఫ్యాప్టో సభ్య సంఘం నాయకులు యుటిఎఫ్ నుండి బి నవీన్ పాటిల్, రవికుమార్, ఏపీటీఎఫ్ 1938 నుండి ఎస్ ఇస్మాయిల్, మరియానందం, నరేంద్రనాథ్, ఏపీటీఎఫ్ 257 నుండి యోగేశ్వరుడు, జయరాముడు, డిటిఎఫ్ నుండి సుబ్బరాయుడు, ఆప్టా నుండి ఎం. నాగార్జున, మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం అయినది.

