NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి  కార్యాలయం నుండి వచ్చిన అర్జీదారులకు కలెక్టర్ ఫోన్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి అర్జీదారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఐఏఎస్   స్వయంగా  మాట్లాడి విచారించడం జరిగింది .ఇందులో భాగంగా రెవెన్యూ శాఖకు సంబంధించి హోలగుండ మండలం ఎం. నాగమణి, దేవనకొండ మండలం కె. సరోజ, కోడుమూరు మండలం మైమున్ బీ  తో వారు పెట్టుకున్న అర్జీలను  విచారించి, పూర్తి విచారణ చేయవలసిందిగా సంబంధిత తహసిల్దార్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్  ప్రతి వారం స్వయంగా అర్జిదారులతో మాట్లాడి అర్జీలను పరిష్కరించడం ద్వారా అర్జీదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *