విద్యార్థినుల డ్రాప్ ఔట్ గుర్తించేందుకు తనిఖీలు చేయాలి
1 min read

డ్రాప్ ఔట్ లు లేరని పాఠశాల,గ్రామ,మండల స్థాయిలో నిర్ధారించి ఈ నెల 25వ తేదీలోపు తీర్మానం చేయాలి
విద్యా,ఐసిడిఎస్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో బడి ఈడు పిల్లలందరిని బడిలో చేర్చి డ్రాప్ ఔట్ లు లేరని పాఠశాల,గ్రామ,మండల స్థాయిలో నిర్ధారించి ఈ నెల 25వ తేదీ లోపు తీర్మానం చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం విద్యా,ఐసిడిఎస్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో డ్రాప్ ఔట్,చదువు మధ్యలో ఆపివేసిన బాలికల వివరాలు సేకరణ పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 3,590 మంది విద్యార్థులు బడి బయట ఉన్నట్లు గుర్తించడం జరిగిందని,వారందరిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఆ బాలికల లు వేరే ప్రాంతంలో చదువుతున్నారా,వేరే ఇతర కారణాలు ఉన్నాయి ఉన్నాయ, బాల్య వివాహాలు ఏమైనా జరిగాయా ఆరా తీయాలన్నారూ.సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకట లక్ష్మమ్మ, ఐసిడిఎస్ పిడి పి.శారద,మండల విద్యా శాఖాధికారులు పాల్గొన్నారు.

