భూములకు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి
1 min read

జిల్లా జాయింట్ కలెక్టర్లు, డియర్ ఓలతో రాష్ట్ర భూపరిపాలన శాఖ చీఫ్ కమీషనర్ వీసీ
అగ్రిగోల్డ్ కు సంబంధించిన ప్రభుత్వo అటాచ్ చేసిన ఆస్తులు,భూములకు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి
పాల్గొన్న జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అగ్రి గోల్డ్ కు సంబంధించి ప్రభుత్వం అటాచ్ చేసిన ఆస్తులు, భూములకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలనీ రాష్ట్ర భూపరిపాలన శాఖ చీఫ్ కమీషనర్ జి.జయలక్ష్మి సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. అగ్రి గోల్డ్ ఆస్తులకు సంబంధించి భూములు గుర్తింపు, ప్రభుత్వ విలువ, ప్రైవేట్ మార్కెట్ విలువ, మ్యుటేషన్, తదితర అంశాలపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓ లతో రాష్ట్ర భూపరిపాలన శాఖ చీఫ్ కమీషనర్ జి. జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ అగ్రి గోల్డ్ ఆస్తులకు సంబంధించి సేల్ డీడ్ లను అనుసరించి సంబంధిత భూములను బౌతికంగా పరిశీలించి, ఆయా భూముల ప్రభుత్వ విలువలు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుండి, మార్కెట్ విలువను అధికారిక ఏజెన్సీ నుండి పొంది, మ్యుటేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అగ్రిగోల్డ్ భూముల ఫీజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను వెంటనే చేపడతామని, సంబంధిత భూముల ప్రభుత్వ, మార్కెట్ విలువలు, మ్యుటేషన్ లపై నివేదిక అందిస్తామని చెప్పారు. డిఆర్ ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా రిజిస్ట్రార్ కొమ్మినేని శ్రీనివాస్, డిఎస్పీ శ్రావణ్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాధికారి యు. సురేంద్రనాథ్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు రవి,చల్లన్న దొర , ప్రభృతులు పాల్గొన్నారు.


