NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలి            

1 min read

పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యాం కుమార్  

పత్తికొండ , న్యూస్​ నేడు:  విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ సూచించారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని ఎంపీ యుపి సెంట్రల్ స్కూల్ ను ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్, గ్రంధాలయ జిల్లా చైర్మన్ తుగ్గలి నాగేంద్ర  జిల్లా ఉపాధ్యక్షులు  సందర్శించారు . ముందుగా పాఠశాలల్లోని సరస్వతి విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. పాఠశాలలో విద్యాబోధన, మధ్యాహ్నం భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పించిందని అన్నారు. విద్యార్థులతో ఎమ్మెల్యే ముచ్చటించి విద్యాబోధన,మౌలిక సదుపాయాలు ఆహార నాణ్యత, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలికల విద్యను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యేకు కానుకగా  వచ్చిన నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలు  విద్యార్థినీ, విద్యార్థులకు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  తిమ్మయ్య చౌదరి, పర్లా శ్రీనివాసులు, ముత్యాల తిరుపాలు,మండల విద్యాశాఖ అధికారులు ,ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *