తక్కువ ధరకు 5 కోట్ల భూమి అంటూ ఎర, 14 లక్షలు టోకరా
1 min read
నకిలీ పాసు పుస్తకాలతో మోసగించిన ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె న్యూస్ నేడు ప్రతినిధి : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి భారీ భూమోసం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కదిరి – పలమనేరు జాతీయ రహదారి ప్రక్కన బసినికొండ పంచాయతీ పరిధి లో సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 2.52 ఎకరాల (సర్వే నంబర్లు 773/డి, 773/2సి, 773/బి, 773/2ఏ, 553/1సి 3) భూమిని కేవలం రూ. 13 లక్షలకే ఇస్తామని నిందితు లు మదనపల్లెకు చెందిన బాధితు రాలు పొన్నంరెడ్డి శోభారాణి, ఆమె భర్త పుల్లారెడ్డిలను నమ్మించారు. ముందస్తు పధకం ప్రకారం పొలం వద్దకు తీసుకెళ్లి కొలతలు వేయించి, 2025 సెప్టెంబర్ 1న రూ. 13 లక్షలు నగదుగా తీసుకొని అగ్రిమెంట్ రాసి చ్చారు. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తా మని చెప్పి మరో రూ. లక్ష తీసు కొని, తహసీల్దార్ సంతకం ఉన్నట్లుగా నకిలీ (ఫోర్జరీ) పాస్ పుస్తకాలను సృష్టించి బాధి తులకు అంద జేశారు. అయితే, తమకు ఇచ్చిన పాస్ పుస్తకాలు నకిలీవని, సదరు భూమిని అప్పటికే ఇతరులకు విక్ర యించారని తెలుసుకున్న బాధితులు నిందితులను నిలదీశారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, నిందితులు ప్రాణహాని కలిగి స్తామని బెదిరింపు లకు పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు 2026 జులై 29న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ లో మోసం నిర్ధారణ కావడంతో చట్ట పరమైన చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, మదనపల్లె డీఎస్పీ యం. బుచ్చిరాజు పర్య వేక్షణలో తాలూకా సీఐ కళా వెంకట రమణ శనివారం నిమ్మనపల్లె నాలుగు రోడ్ల కూడలి (కదిరి – మదనపల్లె మెయిన్ రోడ్డు) వద్ద ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదు గురిని అరెస్టు చేశారు. ఈ కేసుతో ఇంకా ఏమైనా సంబంధం ఉన్న ముద్దాయిలను తదుపరి దర్యాప్తు లో అరెస్ట్ చేయ నున్నట్లు తెలిపారు.ఇందులో
నిందితుల ఉప్పు తోళ్ళ శేఖర్ బాబు ల్యాండ్ బ్రోకర్,
గడియారం మురళి,
గడియారం యర్రప్ప,గడియారం మణి,గడియారం రెడ్డెప్ప వున్నన్నారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ స్పందిస్తూ ప్రజలు భూములు కొను గోలు చేసే ముందు రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, భూమి యాజ మాన్య హక్కులను సంబంధిత అధికారుల వద్ద తప్పనిసరిగా ధృవీకరించుకోవాలన్నారు. తక్కువ ధరకే విలువైన భూములు ఇప్పిస్తామని ఆశ చూపే వ్యక్తులను గుడ్డిగా నమ్మ కూడదన్నారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) యం. వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ యం. బుచ్చిరాజు, తాలూకా సీఐ కళా వెంకటరమణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


