ముఖ్య మంత్రి సహాయ నిధి వందలాది కుటుంబాలకు ఊరట:ఎమ్మెల్యే కోట్ల
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన మొత్తం రూ.35,97,311/- విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 16 నెలల కాలంలో డోన్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని గౌరవ ఎమ్మెల్యే తెలిపారు. ఈ కాల వ్యవధిలో నియోజకవర్గానికి చెందిన మొత్తం 543 మంది లబ్ధిదారులకు రూ.5,11,99,337/- విలువైన ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు మరియు ఇతర సంక్షేమ కారణాల నిమిత్తం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపశమనం కలిగించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న దానికి ఇది నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు.ఈకార్యక్రమంలో హుస్సేన పురం సింగల్ విండో అధ్యక్షుడు సీనియర్ తేదేపా నాయకులు సీమా సుధాకర్ రెడ్డి, తేదేపా నాయకులు గడ్డం ప్రసాద్ రెడ్డి, లక్ష్మి నారాయణ యాదవ్, తదితరులు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

