ఆశా వర్కర్ల సమస్యలపై మార్చి 5న చలో విజయవాడ
1 min read

ఎస్.ఏ. చిన్న రహి మాన్
ప్యాపిలి న్యూస్ నేడు: శిక్షణ పొందిన ఏఎన్ఎం జిఎన్ఎమ్ లకు పర్మిట్ పోస్టుల భర్తీ సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్య పెంచాలని కోరుతూ జలదుర్గం పిహెచ్సి సెంటర్ మెడికల్ ఆఫీసర్ హరిత కి వినతి పత్రం ఇవ్వడం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ. చిన్న రహి మాన్ మాట్లాడుతూ వేతనాలు పెంచి ఏడు సంవత్సరాలు అవుతుందని ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్స్ కు వేతనాలు పెంచాలని ఇరవై సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు సెలవులు లేకపోవడంతో అనారోగ్యాల పాలవుతున్నారని కావున అంగన్వాడీలకు అమలవుతున్న అన్ని రకాల సెలవులు (వేసవి సెలవులు) ఆశ వర్కర్లకు అమలు చేయాలని ప్రభుత్వం చెల్లించే పదివేలల్లో నెలలో పిహెచ్సి లకు మరియు ఆసుపత్రులకు వెళ్లడానికి మూడు నుండి నాలుగు వేలు ఖర్చవుతున్నాయని అన్నారు. సంబంధం లేని పనులు చేయించడం అధిక జనాభాలో పనిచేయడం వలన ఆశ వర్కర్స్కు తీవ్ర పని ఒత్తిడి గురై అనారోగ్య పాలవుతున్నారు అన్నారు. సమస్యల పరిష్కరానికై మార్చి 5వ తేదీన విజయవాడలో రాష్ట్ర ధర్నా నిర్వహి ంచాలని యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని అన్నారు. డిమాండ్:-కనీస వేతనాలు చెల్లించాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశలుగా మార్చాలి, సమాన వేతనం ఇతర సౌకర్యాలు కల్పించాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని, దహన సంస్కరాలు ఖర్చులు ఇవ్వాలని, నియమాకాలు ప్రభుత్వమే చేపట్టాలని, పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఆశ వర్కర్ సంఖ్యను పెంచాలి. పీహెచ్సీ కి వెళ్లిన ప్రతి సందర్భంలో టీఏ డీఏలు ఇవ్వాలని, ఏఎన్ఎం జిఎన్ఎమ్ శిక్షణ పొందిన ఆశాలకు పెర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలని, 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నాణ్యమైన మొబైల్స్ యూనిఫామ్ ఇవ్వాలని కాళీ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. పై సమస్యలపై మార్చి 5వ తేదీన చలో విజయవాడ జయప్రదం చేయాలని ఆశలకు కోరారు.ఈ సమావేశంలో సిఐటియు నాయకులు సి. మధు, రాసి పోగుల శివ ప్రతాప్, ఆశ వర్కర్లు లక్ష్మీదేవి, పీ, కృష్ణవేణి, సునీత, రేణుక తదితరులు పాల్గొన్నారు.

