బడేటి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
1 min read

వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 58 మందికి పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపిస్తోన్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దాంట్లో భాగంగానే అవసరార్థులకు ఎటువంటి ఆలస్యం లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిరంతరాయంగా అందిస్తున్నామని వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా సోమవారం స్థానిక పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న నియోజకవర్గానికి చెందిన 58 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 32లక్షల, 7వేల, 513 రూపాయల విలువైన చెక్కులను, 2లక్షల, 21వేల, 727 రూపాయల విలువైన ఒక ఎల్వోసి కాపీని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పరంపర నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. ఈ విషయంలో అవసరార్ధులందర్ని చైతన్యపరుస్తోన్న కూటమి నాయకులను, కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేవలం 20నెలల కాలంలోనే 5కోట్ల, 5లక్షల, 39వేల, 612 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజకవర్గంలోని బాధితులకు అందించి, వారికి భరోసా కల్పించామన్నారు. కోట్లాదిరూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా అందించి అనారోగ్యవంతులను ఆదుకుంటోన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదేతరహాలో రానున్న కాలంలో మరింత మంది బాధితులకు సహాయం అందించనున్నట్లు ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్ కర్రి శ్రీనివాస్, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, మారం హనుమంతరావు, నాయకులు బెల్లపుకొండ కిషోర్,బడిశెట్టి శ్రీను, నేరుసు గంగరాజు మరియు పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, క్లస్టర్ ఇంచార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

