భారీగా పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి : సిపిఎం
1 min read

న్యూస్ నేడు, పత్తికొండ: కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచి గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుండి ర్యాలీగా వచ్చి నాలుగు స్తంభాల కూడలి దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మండల కమిటీ సభ్యులు సురేంద్ర, అధ్యక్షత వహించగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దస్తగిరి, గోపాల్, సిద్దయ్య గౌడ్, మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్రలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా నిత్యవసర ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో గ్యాస్, డీజిల్ పెట్రోల్ నిత్యవసరాల ధరలు పెంచబోమని ప్రకటన చేసిన రెండు రోజులకే సిలిండర్ పై 60 రూపాయలు వాణిజ్యసిడర్ పై 114 రూపాయలు పెంచడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తాను ఇచ్చిన మాట ప్రకారం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. పేద ప్రజలపై విధించిన పన్నులను బారాలను పేద మధ్యతరగతి ప్రజలు నోటుబుక్కులో రాసుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. తదనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసిల్దార్ హుస్సేన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నరసన్న, అమాలి సంఘం నాయకులు చంద్ర, ఉరుకుందు, మండల కమిటీ సభ్యులు రామాంజనేయులు, మద్దికేర సిఐటియు కార్యదర్శి రాముడు, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు దిగ్గెన్న, ప్రజానాట్యమండలి కార్యదర్శి రమేష్, కాశి, రైతు సంఘం నాయకులు రాజుల కారప్ప,ఆటో వర్కర్స్ నాయకులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

