కార్మికుల హక్కుల కోసం పుట్టింది సిఐటియు ఎర్రజెండా : ఎస్.ఎ. చిన్న రహిమాన్
1 min read
ప్యాపిలి (న్యూస్ నేడు): కార్మికుల హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం పుట్టింది ఎర్రజెండా అని సిఐటియు ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ. చిన్న రహిమాన్ సహాయ కార్యదర్శి పద్మశాలి శ్రీనివాసులు, వడ్డే శ్రీనివాసులు అన్నారు. ముందుగా జలదుర్గం గ్రామంలో శనివారం సిఐటియు జెండాను ఎస్.ఎ. చిన్న రహిమాన్ ఆవిష్కరించినారు. వారు మాట్లాడుతూ విశాల భారత కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే లక్ష్యంతో పశ్చిమ బెంగాల్ కలకత్తాలో 1970 మే 30వ తేదీన సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భవించిందన్నారు. నాటి నుండి నేటి వరకు అన్ని రంగాలకు సీఐటీయూ విస్తరించిందని కార్మికుల హక్కుల కోసం పోరాడుతూనే ఉద్యోగ ఉపాధ్యాయ రైతాంగ ప్రజా సమస్యలకు సామాజిక పోరాటాలకు మద్దతిస్తూ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ అనేక విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నది భారత దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘం సిఐటియు అన్నారు. కార్మిక హక్కులు కల రాసే నాలుగు లేబర్ కోట్స్ ను వెంటనే రద్దు చేయాలి అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మిట్ చేయాలని కనీస వేతన చట్టం అమలు చేయాలని అన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను కాపాడుకునేందుకు తిరిగి పోరాటాలు చేయవలసిన దుస్థితి దాపరించడం నేటి పాలకుల నిరంకుశ వైఖరి కి నిదర్శనమని ఏది ఏమైనా యావత్తు కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాసి పోగుల మధు, రాసి పోగుల శివ ప్రతాప్, వెంకట్ రమణ, రహమతుల్లా, అలీ అక్బర్, మహేష్, పెద్ద నాగన్న, గుండాల భాష, అల్లా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


