పక్షవాత బాధితురాలికి ఐరన్ మంచం అందజేత : స్ఫూర్తి సంస్థ
1 min read
ప్యాపిలి (న్యూస్ నేడు) : డోన్ పట్టణానికి చెందిన లక్ష్మి అనే పక్షవాత బాధితురాలి దీనస్థితిని చూసి స్ఫూర్తి సంస్థ స్పందించింది. స్ఫూర్తి శ్రేయోభిలాషులు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అజ్ఞాత దాత అందించిన ఆర్థిక సహకారంతో, ఆమెకు సుమారు పది వేల రూపాయల విలువైన మెడికల్ ఐరన్ మంచాన్ని (బెడ్‌తో సహా) ఉచితంగా అందజేశారు. పేరు బయటకు చెప్పుకోకుండా బాధితురాలికి అండగా నిలిచిన ఆ అజ్ఞాత దాతకు స్ఫూర్తి సభ్యులు, పక్షవాత బాధితురాలు లక్ష్మి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సేవయే పరమావధిగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న స్ఫూర్తి సంస్థ సభ్యులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు స్ఫూర్తి మధు, మోహన్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

