NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బడ్జెట్లో మైనార్టీలకు వరాలు జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు నాయుడు

1 min read

మైనార్టీల సంక్షేమానికి రూ.6090కోట్ల భారీ బడ్జెట్.

మైనారిటీ ల అభివృద్ధికి  కూటమి ప్రభుత్వం కంకణం కట్టి కేటాయించినారు.

కర్నూలు, న్యూస్​ నేడు: గత ఏడాది బడ్జెట్ కంటే రూ. 656 కోట్లు అదనం. సబ్ ప్లాన్ అమలు ద్వారా  మైనారిటీ ల అభ్యున్నతికి మరింత కృషి ఏపీ సీఎం. నారా చంద్రబాబు నాయుడు. పైన మైనార్టీ ముస్లింలు రాష్ట్రవ్యాప్తంగా హర్షం  వ్యక్తం చేస్తున్నారు. ఇదే మారుగా ఇలా గడ్డ ఫక్రుద్దీన్ తెలిపినారు. ఆదోనిలోని ఆదివారం విలేకరులు సమావేశంలోని.గడ్డ ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి. ఈ సమావేశంలోని ఇలా తెలియజేసినారు. 2026-2027వార్షిక బడ్జెట్ పై  మైనారిటీ మంత్రి  ఎన్ఎండి ఫరూక్ ప్రశంసల జల్లు. సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి కేశవ్ కు కృతజ్ఞతలు.గడ్డ ఫక్రుద్దీన్. అన్నారు. ఆంధ్రప్రదేశ్ 2026-2027 సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి  పయ్యావుల కేశవ్  ప్రవేశపెట్టిన బడ్జెట్లో  మైనారిటీ ల సంక్షేమానికి  రూ. 6090 కోట్లు కేటాయించడంపై  రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రశంసల జల్లు కురిపించారు .పయ్యావుల కేశవ్ ఎన్ఎండి ఫరూక్ కి అభినందనీయం తెలిపిన గడ్డ ఫక్రుద్దీన్ .రాష్ట్రంలోని మైనారిటీ ల సంక్షేమానికి  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో  ప్రాధాన్యత కల్పించడమే ఇందుకు నిదర్శనమని  శనివారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్లో మౌలిక సబ్ ప్లాన్ ద్వారా మరింత లబ్ది. మైనారిటీ సబ్ ప్లాన్ అమలు క్రింద ఇతర శాఖల ద్వారా మైనారిటీ లకు మరింత మేలు చేకూరుతుందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా  రూ. 638.40 కోట్లు, ఉద్యాన శాఖ ద్వారా రూ. 57.33 కోట్లు, మత్స్యశాఖ ద్వారా రూ. 39.60 కోట్లు, ఎనర్జీ శాఖ ద్వారా రూ. 1129.21 కోట్లు, పాఠశాల విద్యాశాఖ ద్వారా రూ.631 కోట్లు, పౌరసరఫరాల  శాఖ ద్వారా రూ. 294.27 కోట్లు, గృహ నిర్మాణ శాఖ ద్వారా  బలహీనవర్గాల గృహ నిర్మాణం కోసం  రూ. 352.87 కోట్లు, పరిశ్రమల శాఖ ద్వారా రూ. 2.64 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ. 1.76 కోట్లు,  దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ లు, సీనియర్ సిటిజన్లకు రూ. 5.19 కోట్లు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు.మైనారిటీ సబ్ ప్లాన్ ద్వారా రూ.3133కోట్లు, మైనారిటీ సంక్షేమం కు రూ. 2957కోట్లు, మొత్తం రూ.6090కోట్లు బడ్జెట్ తో  2026-2027 వార్షిక ప్రణాళిక అమలు చేయబోతున్నామని అన్నారు.రాష్ట్రంలోని మైనారిటీ ల సంక్షేమానికి  కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చి  నిధుల కేటాయింపు చేయడంపై  మైనారిటీ వర్గాల ప్రజలందరూ  సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కి.  ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి మైనార్టీ వర్గాల తరఫున మరి  మంత్రి  ఫరూక్ కి గడ్డ ఫక్రుద్దీన్ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు   పేర్కొన్నారు.

About Author