NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువత క్రీడల్లో రాణించాలి

1 min read

చట్నీహళ్లి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ₹25,000 బహుమతి ప్రదానం

మంత్రాలయం న్యూస్ నేడు :  యువత క్రీడల్లో రాణించాలని మంచాల సొసైటీ ఛైర్మెన్ రామకృష్ణ రెడ్డి తనయుడు టిడిపి యువ నాయకులు రాజారెడ్డి, మంచాల సొసైటీ డైరెక్టర్ చాపల నాగేష్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చెట్నిహల్లి గ్రామంలో శ్రీ బీరలింగశ్వర దేవర సందర్బంగా క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహిస్తూ ముందడుగు వేసిన మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి  రాఘవేంద్ర రెడ్డి  ఆదేశాల మేరకు  నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు మొదటి బహుమతిగా రూ 25,000 నగదు బహుమతి గా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మన యువతలో క్రీడా అభిరుచి పెంపొందించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ,సొసైటీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి  ఉంటారని తెలిపారు. యువత చదువు తో పాటు క్రీడల్లో కూడా రాణీంచాలని సూచించారు. ఈ కార్యక్రమం లో టీడీపీ సీనియర్ నాయకుడు మేకల మల్లేష్, పెద్దలక్ష్మయ్య, డిలర్ గోపాల్, విద్యాకమిటి చైర్మన్ పరమేష్, టిడిపి గ్రామ అధ్యక్షులు చాకలి నరసింహులు, వీరేష్, రామ్మూర్తి, రామాంజులు,హనుమయ్య, రామకృష్ణ, నాగరాజు, వెంకట్రామా గౌడ్, హనుమంతు, జయరాముడు, గ్రామ పెద్దలు, క్రీడా కారులు పాల్గొన్నారు.

About Author