రాఘవేంద్రుని సన్నిధి లో సీఎం చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు డాక్టర్ గురురాజ్ రావు
1 min read
మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యక్తిగత వైద్యులు డాక్టర్ గుర్రాజరావు శనివారం మంత్రాలయం వచ్చారు. వీరికి మంత్రాలయం టిడిపి మండల కన్వీనర్ పన్నగా వెంకటేష్ స్వామి స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని , ప్రత్యేక పూజలు చేసి, మంగళహారతి ఇచ్చారు .అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.వారి వెంట కోసిగి సిఐ మంజూనాథ్ ,మంత్రాలయం ఎస్సై మల్లికార్జున, టిడిపి నాయకులు వట్టప్ప నరసింహ, సున్నం రామకృష్ణ, రఘు, గణికంటి గురురాజ్ తదితరులు ఉన్నారు.


