బుక్ ఆఫ్ వరల్డ్ ను డా. ఎం.ఏ. రాఘవేంద్ర కు ప్రధానం చేసిన పీఠాధిపతి
1 min read
మంత్రాలయం న్యూస్ నేడు : హైదరాబాద్ ఎస్‌ఆర్‌ఎస్ పెయిన్ క్లినిక్ వ్యవస్థాపకులు, ఎం.పీ.టి న్యూరో, డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్ అయినడాక్టర్ ఎం ఏ రాఘవేంద్ర కు అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది.ప్రఖ్యాత హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ నుండిపెయిన్ మేనేజ్‌మెంట్ మరియు ఫిజియోథెరపీ రంగంలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్నారు. శనివారం ఈ పురస్కారంమంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు అందజేశారు. డా. ఎంఏ రాఘవేంద్ర రోగులకు అందిస్తున్న సేవలలో ముఖ్యంగా శస్త్రచికిత్స లేకుండా చికిత్స అడ్వాన్స్ డ్రై నీడిలింగ్ ఆస్ట్రేలియాన్ చికిత్స ద్వారా సయాటికా నొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి, మస్కులోస్కెలెటల్ సమస్యలు, న్యూరోలాజికల్ సమస్యలుకు ఆధునిక మరియు ఫలప్రదమైన చికిత్స అందిస్తున్నారు.ఈ లాంటి సామాజిక సేవలను గుర్తించి ఈ పురస్కారం దక్కడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. వైద్యం లో మరింత బాధ్యతను పెంచిందని, రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎస్ ఆర్ ఎస్ పెయిన్ క్లినిక్ సేవలు, సయాటికా ట్రీట్‌మెంట్, నెక్ పెయిన్ మేనేజ్‌మెంట్,బ్యాక్ పెయిన్ రిహాబిలిటేషన్,డ్రై నీడ్లింగ్ థెరపీ,న్యూరో ఫిజియోథెరపీ,స్పోర్ట్స్ ఇంజరీ రిహాబిలిటేషన్పోష్చర్ కరెక్షన్ థెరపీ ద్వారా గుర్తింపు పొందిన ఎంఏ రాఘవేంద్ర కు శేషవస్త్రం, మొమెంటో, ఫల, పుష్ప మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి సత్కరించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మరిన్ని ఉన్నత పురష్కరాలు అందుకోవాలని పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు అభినందించారు.


