కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది
1 min read

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూటమి నాయకులు.
హొళగుంద న్యూస్ నేడు : అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు అన్నారు.శనివారం హోళగుంద మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం -4 నందు రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి విడతలవారీగా 20వేల రూపాయలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మొదటి విడత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు కూటమి పార్టీల నాయకులు పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో చేసిన ప్రసంగాన్ని వీక్షించారు.అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల సంక్షేమానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని అన్నారు. రైతన్నలకు పెట్టుబడి సాయం కింద ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదటి విడతగా 5000 రూపాయలు, పీఎం కిసాన్ 2000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలు జమ చేయడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతుల పాడి పశువుల కొరకు గోకులం షెడ్ల నిర్మాణం, రైతన్నలకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సహిస్తూ ఉపాధి హామీ పథకం ద్వారా ఆసక్తి కలిగిన రైతులకు ఉచితంగా మొక్కలను అందించడం జరిగిందని అన్నారు. రైతులకు సూక్ష్మ సేద్యం డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం కోసం 90% సబ్సిడీ కల్పించిందని అన్నారు. ఇలా రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తూ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి కన్వీనర్ వీరన్న గౌడ్, జనసేన కన్వీనర్ అశోక్,తెదేపా సీనియర్ నాయకులు శేషగిరి,అబ్దుల్ సుభాన్,జమాపుర బసవ,ఎర్రి స్వామి, దిడ్డి వెంకటేష్, సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్,దిడ్డి తిక్క స్వామి,జాకీర్, అబ్దుల్ రహిమాన్,రామాంజి, బాగోడి రాము, బిజెపి నాయకులు చిదానంద,ఉలిగణ్ణ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.


