NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రాజెక్టులను విస్మరించిన కూటమి ప్రభుత్వం

1 min read

లిఫ్ట్ ఇరిగేషన్ పెంచిన ఘనత వైయస్ జగన్

కేసులకు అరెస్టులకు భయపడేది లేదు

హాజరైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,సీమ నేతలు

పోతిరెడ్డిపాడు’రైతు శంఖారావం’సభ దిగ్విజయం

నందికొట్కూరు, న్యూస్​ నేడు: రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రులు వైసీపీ నేతలు ప్రశ్నించారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించాలని కోరుతూ గురువారం’రైతు శంఖారావం’ బహిరంగ సభ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది.ఈ సభకు రాయలసీమలోని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లాల అధ్యక్షులు నేతలు భారీగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో నీటిని ఆపినందుకే సభ నిర్వహించాల్సి వచ్చిందని ఇది ఆరంభం రైతుల పక్షాన ఆఖరి శ్వాస వరకు పోరాడుతామని అన్నారు. టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ అంటే నీళ్లు ఉండవు సీమ కరువు-ఆకలి చావులు ఆపాలంటే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని వాటిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. మాజీమంత్రి శైలజా నాథ్ మాట్లాడుతూ 11వేల క్యూసెక్కుల నీటిని 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందన్నారు. కర్నూలు,నంద్యాల జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి,ఎస్ వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రాజెక్టుల్లో నీళ్లు ఆపాలని నేను చెప్పినందుకే నీళ్లు ఆపారని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని మరి గురు,శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చేస్తున్న గుసగుసలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేసులకు దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మనకు రావలసిన వాటా రావాల్సిందే నని కూటమి ప్రభుత్వ కుతంత్రాలను అడ్డుకోవాలిరాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇక్కడి నుండే శంఖారావం ప్రారంభించామని రాయలసీమలో అంతటా సభలు నిర్వహిస్తామన్నారు. వైయస్సార్సీపి జనరల్ సెక్రెటరీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు పనులు పూర్తి చేసేందుకు వామ వామపక్చ ప్రజా సంఘాలతో కలుపుకొని ఉద్యమిస్తామని 2029 లో జగను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని అప్పుడు ప్రాజెక్టులను ఎత్తు పెంచి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ గాలేరు నగరి, హంద్రీనీవా,ఎస్ఆర్ బిసి, తెలుగు గంగా ప్రాజెక్టులను వైయస్సార్ పూర్తి చేశారని చంద్రబాబు రాయలసీమపై కక్చ పెట్టుకొని లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి డాక్టర్ సుధీర్, రాయలసీమ నేతలు మాట్లాడారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *