ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే లక్ష్యంతోనే దాడులు…
1 min read
ఆలూరు న్యూస్ నేడు: మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసిని పరిశీలించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి జోగి రమేశ్ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసానికి నేడు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.దాడి జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి * మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.ప్రశ్నించే గొంతులను అణచి వేయాలనే లక్ష్యంతోనే ఇటువంటి దాడులకు పూనుకుంటుందన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసులు వైఫల్యమే దాడులకు కారణమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,జోగి రమేష్ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు….ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి .. ఈ కార్యక్రమంలో వైయస్సార్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


