NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫ్లోరోసిస్ వ్యాధిపై దంత వైద్యుల అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని  జిల్లా సత్వర చికిత్స కేంద్రాములో (DIEC) ఓపిల నెంబర్ 43  లో గల దంత వైద్యులతో ఫ్లోరోసిస్ కేసుల గురించి   మరియు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రాంతాల నుండి వచ్చేవారికి ఫ్లోరోసిస్ వ్యాధి గురించి . దంత వైద్యులు  మరియు దంత సహాయకుడు  మహిళలకు అవగాహన కల్పించని     ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టర్,సుధాకర్  కోరారు.   అనంతరం మాట్లాడుతూ 0 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలలో వచ్చే పుట్టుక లోపాలు,   గర్భధారణ సమయంలో ఫ్లోరైడ్ అధికంగా ఉన్న నీటిని వంటలలో ఉపయోగించడం వలన మరియు నీటిని త్రాగిన గర్భవతులకు ప్రేగు గోడలు దెబ్బతిని  శరీరం  ఐరన్ ను శోషించు బడదు  అని తెలిపారు.  . ఫ్లోరైడ్ అధికంగా ఉన్న నీటిని త్రాగడం వలన  గర్భిణికి రక్తహీనత రావచ్చునని తెలిపారు.ధీర్ఘకాలిక  ఫ్లోరైడ్ తో బాధపడుతున్న  గర్భిణిలలో పుట్టబోయే శిశువులకు దంతాలు ప్రారంభ దశలో    వారి పండ్లు  యెగుడు,దిగుడుగా  ఉంటాయని,పిల్లలు మరుగుజ్జుతనానికి లోనవుతారని  తెలిపారు.    ఫ్లోరోసిస్ ఉన్న ప్రాంతాలలో గర్భిణీలు క్యాల్షియం,ఐరన్,విటమిన్ –సి,మరియు జింక్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించినారు.ఈ కార్యక్రమములో  చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్.సృజన ,డెంటల్ డాక్టర్. లక్ష్మి రెడ్డి, ,DIEC మేనేజర్ ఇర్ఫాన్ ,దంత సహాయకుడు ప్రమోద్ కుమార్  మరియు  ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author