గుమ్మనూరు జయరాం వ్యాక్యల పట్ల ఖండన..
1 min read

రైతు సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి కి క్షమాపణ చెప్పాలి….
పత్తికొండ, న్యూస్ నేడు: రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి కి ఫోన్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంతకల్ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని, దౌర్జన్యకరంగా రైతుల పట్ల రైతు సంఘం నాయకులు పట్ల ఆయన వైఖరిని ప్రజాస్వామ్య వాదులు అంతా ఖండించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.విర శేఖర్, ఆ సంఘం సీనియర్ నాయకులు యూసుఫ్ భాష, రైస్ సంఘం మండల కార్యదర్శి కోటకొండ సూరీలు గుమ్మనూరు జయరాం పేకలపట్ల తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక సిఐటియు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో సోలార్ ప్లాంట్ కొరకు భూసేకరణ నేపథ్యంలో రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి కి ఫోన్లో మాట్లాడుతూ, ఈ గ్రామానికి, ఈ మండలానికి రావలసిన అవసరం ఏముందని వెంటనే గ్రామం నుండి వెళ్లిపోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో వివిధ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని అదేవిధంగా న్యాయంగా ప్రభుత్వం నుండి రావాల్సిన అంశాల గురించి రైతులతో మాట్లాడడానికి వెళ్ళిన ప్రజాసంఘాల నాయకత్వంపై అనుచితంగా మాట్లాడి, దౌర్జన్యంగా మాట్లాడడం సరికాదని తెలిపారు.

