NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి పేరెంట్స్, టీచర్స్ మీట్ దోహదం

1 min read

జిల్లాలోని 2 లక్షల 56 వేల 393 మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం పధకం

పెదపాడులోని కాకరాల చంద్రశేఖర్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో మెగా పేరెంట్స్,టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

కార్యక్రమంలో తమ తల్లుల పాదాలకు పూజలు చేసిన విద్యార్థినీ,విద్యార్థులు

 ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి పేరెంట్స్, టీచర్స్ మీట్ ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.   పెదపాడు మండలం పెదపాడులోని కాకరాల చంద్రశేఖర్  జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో   శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ 4.0 లో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.  మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయంతో ప్రారంభమైన కార్యక్రమంలో ముందుగా  విద్యార్థినీ, విద్యార్థులు తమ  తల్లుల పాదాలకు పాద పూజలు చేశారు.   ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలోని 1772 ప్రభుత్వ పాఠశాలలు, 20 జూనియర్ కళాశాలల్లో పెద్దఎత్తున  మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని పెంచడం ద్వారా  విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.  ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలతో  కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినీ, విద్యార్థులు ప్రతిభను చాటుతున్నారన్నారు.  విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాలు పెంపుదల , తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పాఠశాల–కుటుంబ సంబంధాలను పటిష్టపరచడం మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్  యొక్క ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రతీ తల్లితండ్రులు లీప్ యాప్ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని,లీప్ యాప్ లో   తమ పిల్లలు హాజరు, అభ్యాసన  స్థాయిని తెలుసుకోవడం, వాటిని మరింత పెంపొందించేందుకు అవసరమైన సూచనలు ఉపాధ్యాయుల నుండి తల్లితండ్రులు పొందవచ్చన్నారు. జిల్లాలో 2 లక్షల 56 వేల 393 మంది విద్యార్థులకు సంబందించి  లక్షా 65 వేల  722 మంది తల్లుల ఖాతాలకు 13 వేల  రూపాయలు చొప్పున తల్లికి వందనం నిధులను రాష్ట్ర ప్రభుత్వం  జమ చేసిందన్నారు.జీవితంలో ఉన్నత అవకాశాలకు 10వ తరగతి ఫలితాలు ఒక టర్నింగ్ పాయింట్ అని, కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు.  10వ తరగతి  ఇంటర్ ఫలితాలలో  మండల స్థాయిలో ప్రధమ స్థాయి సాధించిన  విద్యార్థినీ, విద్యార్థులు ఈ పాఠశాలకు చెందినవారే కావడంతో వారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. రానున్న 10వ తరగతి ఫలితాలలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యార్థులు  కృషిచేయాలన్నారు.  పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.  అర్హత ఉండి తల్లికి వందనం సొమ్ము జమకాని తల్లితండ్రుల వివరాలు తీసుకుని వాటిని పరిష్కరించాలన్నారు.

 అలరించిన ‘డ్రగ్స్ వద్దు బ్రో ‘  ప్రదర్శన

డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం కారణంగా భవిష్యత్తు ఎంత అంధకారం అవుతుందో   తెలియజేస్తూ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శన కలెక్టర్ ని, సభికులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఇటీవల  పాఠశాల స్థాయిలో విద్యార్థులు మత్తుపదార్థాలకు బానిసలవుతున్నారని, డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో కలెక్టర్ వెట్రిసెల్వి మొక్కలను నాటారు. అనంతరం పాఠశాలలోని పలు విభాగాలను కలెక్టర్ పరిశీలించారు.కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఎంపిడిఓ అమీన్ జమ, ఎంఈఓ సబ్బితి  నరసింహమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. విజయ,ఎస్ఎంసి చైర్మన్ సుబ్రహ్మణ్యం,కమిటీ సభ్యులు,గ్రామ ప్రముఖులు కాశీబాబు,మరడాని రవి, గారపాటి స్టాలిన్,అక్కినేని వంశి,పాఠశాల ఉపాధ్యాయులు,ప్రభృతులు పాల్గొన్నారు.

About Author