గ్రామాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ
1 min read
క్షేత్రస్థాయిలో 3గంటల పాటు ఉండి డ్రైనేజీ పూడికతీత పనుల పర్యవేక్షణ
గ్రామాల నిర్వహణపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
చిత్తశుద్ధికి ఇది మరో నిదర్శనం
మురుగునీరు నిల్వ ఉండటంపై సంబంధిత అధికారుల తీరుపై అసంతృప్తి
మూడు గంటల పాటు అక్కడే ఉండి జేసీబీలతో మురుగు కాలువల మరమ్మత్తులు
డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి
పారిశుధ్యంపై రాజీ పడబోమన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి (కొప్పాక)ప్రజల ఆరోగ్యం మరియు గ్రామాల పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అధికారులకు సూచించారు. మంగళవారం పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని డ్రైన్లు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి, మురుగునీరు రోడ్లపై నిలిచిపోవడం చూసి ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.గ్రామస్తుల ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెంటనే ఎంపీడీవో,గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లను అక్కడికి రప్పించారు. దాదాపు మూడు గంటల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండి, జేసీబీ యంత్రాలు మరియు ఇతర పారిశుధ్య సామాగ్రిని తెప్పించి, పూడికుపోయిన డ్రైన్లకు స్వయంగా పర్యవేక్షిస్తూ మరమ్మత్తులు చేయించారు. మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు.అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజలతో మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను డ్రైన్లలో వేయడం వల్ల మురుగునీరు నిలిచిపోయి రోగాలు ప్రబలే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ మరియు డ్రైన్ల క్లీనింగ్ పట్ల అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అయితే స్వయంగా ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో మూడు గంటల పాటు ఉండి పారిశుద్ధ్యనికి ప్రాధాన్యత ఇచ్చిన తీరు అటు అధికారుల్లోనూ, స్థానిక కూటమి నాయకుల్లోను మరింత స్ఫూర్తిని నింపింది.ఏ గ్రామంలో సమస్య ఉన్నా తాను నేరుగా వస్తానని, ప్రజల కష్టాలను తీర్చడమే తన మొదటి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నాగేంద్ర, కొప్పాక గ్రామ స్పెషల్ ఆఫీసర్ షరీఫ్ సహా పలువురు అధికారులు,పంచాయతీ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

